Tuesday, December 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేసీఆర్ దీక్ష ఫలితమే తెలంగాణ ఏర్పాటు: మాజీ ఎమ్మెల్యే

కేసీఆర్ దీక్ష ఫలితమే తెలంగాణ ఏర్పాటు: మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ కంఠేశ్వర్ 
కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో వచ్చిన రూ.100 కోట్ల నిధులు బిగాల గణేష్ గుప్తా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తెచ్చానని కానీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న  ధన్పాల్ సుర్యనారాయణనే తెచ్చినవే అని ప్రచారం చేసుకోవడం సబబు కాదు అని మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా అన్నారు. మంగళవారం తెలంగాణ విజయ్ దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలభిషేకం చేసి పూలమాల వేశారు. తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకరం అయ్యిందంటే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ప్రజల దశాబ్దాల వాంఛ నెరవేరిన సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి, స్వేచ్ఛ వాయువులను పొందిన సందర్భంగా బెలూన్ గాల్లో వదిలారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేసి కెసిఆర్ సాధించిన తెలంగాణలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ మాట్లాడుతూ.. 29 నవంబర్ 2009వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కై బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడు నినాదంతో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కెసిఆర్ గారి దీక్షను భగ్నం చేయడానికి అక్రమంగా అరెస్టు చేసినా నిరాహార దీక్షను కొనసాగించి ఈ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే మార్గమని ఏ ఇతర ప్రత్యామ్నాయాలు అవసరం లేదని చేపట్టిన దీక్షకు రోజురోజుకు క్షీణిస్తున్న కేసీఆర్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజల దశాబ్దాల కాల పోరాటానికి తల వంచి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రారంభిస్తున్నామని ప్రకటన చేసిన సందర్భంగా ఈరోజు తెలంగాణ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా బారాస కార్యనిర్వహ అధ్యక్షుడు కేటీఆర్ పిలుపుమేరకు నిర్వహించడం జరిగిందని తెలిపారు.

ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ  ఇటీవలే మాట్లాడుతూ.. టి యు ఎఫ్ ఐ డి సి నుండి 100 కోట్లు నిధులు తీసుకువచ్చానని ప్రకటించారు.కానీ అవి ఆయన తెచ్చినవి కాదని నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభిత్చవానికి విచ్చేసిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ జి జి కాలేజీ గ్రౌండ్ మీటింగ్ లో నిజామాబాద్ పట్టణ అభివృద్ధి పనులకోసం 100 కోట్ల నిధులు ప్రకటించారు.ఆ తరువాత జి.ఓ కాపీ వచ్చిన వెంటనే నిజామాబాద్ పట్టణం లో ఆర్ ఆర్ చౌరస్తా నుండి పాత కలెక్టర్ గ్రౌండ్ వరకు కృతజ్ఞత ర్యాలీ నిర్వహించాం. దాదాపు 90 శాతం పనులకు భూమిపూజలు చేసాము,కానీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మా హయం లో తెచ్చినటువంటి 100కోట్ల నిధులు తాను తెచ్చానని చెప్పుకోవడం ఏ మాత్రం సమంజసం కాదు. గడిచిన రెండు సంవత్సరాల కాలంలో సుమారు 100 కోట్లకు పైగా నిధులను తీసుకొచ్చి నగర అభివృద్ధి చేస్తున్నట్టు చేసిన ప్రకటనలను ఖండించారు.

మాజీ ముఖ్యమంత్రి  కేసీఆర్ హయాంలో మంజూరు చేసిన రూ.100 కోట్ల నిధులతో నగరంలోని 60 డివిజన్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని వాటికి పునాదులు వేసి శిలాఫలకాలు ఏర్పాటు చేశామని అప్పటి నిధుల నుండి చేపడుతున్న పనులకు నేనే తీసుకు వచ్చానని ఇప్పటి ఎమ్మెల్యే ప్రచారం చేసుకోవడం సబబు కాదని అన్నారు.మా హయాంలో నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టమని ఇప్పటి ఎమ్మెల్యే నూతన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోయినా మేము చేసిన పనులను కొనసాగించిన సరిపోతుందని, నగరంలో కంటేశ్వర్ నుండి బొర్గం వరకు ఏర్పాటు చేసిన సెంటర్ మీడియాన్ లలోని కనీసం 20% కూడా స్టీట్ లైట్స్ పనిచేయటం లేదని, నాటిన మొక్కలకు నిరు పొసే నాధుడు లేడని, కాలనీలలోని స్ట్రీట్ లైట్స్ పని చేయటం లేదని విమర్శించారు. ప్రజల సందర్శన కోసం ఏర్పాటు చేసిన ట్యాంక్ బండ్ (బొడ్డెమ్మ చెరువు) వద్ద ఊడ్చే నాధుడు లేడని, లైట్లు కూడా పనిచేయని పరిస్థితి ఉందని అన్నారు.

అభివృద్ధిలో పోటీపడి మా కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి నిజామాబాద్ ప్రజలకు సేవ చేసే విధంగా పనిచేయాలని హితవు పలికారు. మా హయాంలో వచ్చిన నిధులను తానే తీసుకువచ్చినట్లు చేసుకుంటున్న ప్రచారాన్ని ఖండించారు.

(మేము మా హయం తెచ్చిన 100 కోట్ల నిధుల జి.వో కాపీ మరియు మేము తీసిన కృతజ్ఞత ర్యాలీ ఫోటోలు కూడా జత చేస్తున్నాము.)ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదాన్న గారి విఠల్ రావ్, ఎమ్మెల్సీ విజి గౌడ్, మాజీ మేయర్ నీతూ కిరణ్ శేఖర్, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి బారాస నగర అధ్యక్షులు సిర్ప రాజు, సీనియర్ నాయకులు సుజిత్ ఠాకూర్ సత్య ప్రకాష్,విశాలిని రెడ్డి, సుమనా రెడ్డి, నవీద్ ఇక్బాల్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -