నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధికారుల నూతన డైరీ 2026, క్యాలెండర్ ను బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆవిష్కరించి, మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఉద్యోగులు క్రమశిక్షణ తో పనిచేస్తూ, రాష్ట్రంలో జిల్లాను అన్ని రంగాలలో ప్రథమ స్థానంలో నిలిపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని ఉద్యోగులు జెఏసి చైర్మెన్ మందడి ఉపేందర్ రెడ్డి అధ్వర్యంలో ఒకే తాటిపై నిలిచి ముందుకు నడుస్తున్నారని, ఇది ఎంతో మంచి పరిణామమని తెలుపుతూ, జిల్లాలోని ఉద్యోగులందరికి శుభాకాంక్షలు తెలిపినారు.
అనంతరం ఉద్యోగ సంఘ నాయకులు మందడి ఉపేందర్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డీవో కృష్ణా రెడ్డి, చౌటుప్పల్ ఆర్డీవో వి శేఖర్ రెడ్డి, తెలంగాణ ఉద్యోగ జాయింట్ ఆక్షన్ కమిటీ చైర్మన్ యదాద్రి భువనగిరి, తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ మందడి ఉపేందర్ రెడ్డి , డి.ఆర్.డి.ఓ నాగిరెడ్డి , టి.జి.ఓ యదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ ప్రసాద్, కార్యదర్శి శ్రీనివాస్, తెలంగాణ నాన్ గెజిటెడ్ అధ్యక్షులు ధరణికోట భగత్, సెక్రటరీ మహమ్మద్ కదీర్ , కోశాధికారి కె శ్రీకాంత్, ఉపాధ్యక్షులు పెండెం శ్రీనివాస్ , ట్రెసా అధ్యక్షులు యం. కృష్ణ, కార్యదర్శి ఆర్ శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శుల అద్యక్షులు శశికాంత్ గౌడ్, రమాదేవి, శైలజ, చైతన్య, శోభ, యశోధా, ఆనంద్, కటకం సిద్దేశ్వర్, ఆసిప్, మోహన్ కుమార్, శ్రావన్ కుమార్,చంద్రారెడ్డి, జిల్లా అధికారులు, టిజిఓ, టిఎన్జీవో సభ్యులు పాల్గొన్నారు.



