Sunday, July 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలురాహుల్ సిప్లిగంజ్‌కు రూ.కోటి ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

రాహుల్ సిప్లిగంజ్‌కు రూ.కోటి ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయలు నజరానా ప్రకటించింది. పాతబస్తీలో బోనాల పండుగ సందర్బంగా గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రూ.కోటి నగదు పురస్కారాన్ని ప్రకటించింది. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. స్వయంకృషితో ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్ యువతకు మార్గదర్శకుడన్నారు.

2023లోనే ఓ ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆస్కార్ గెలుచుకున్న రాహుల్‌ సిప్లిగంజ్‌కు రూ.10 లక్షలు నగదు ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే  కోటి రూపాయల నగదు ఇస్తామని చెప్పారు. ఆర్టిస్టులను సన్మానించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆనాడు రేవంత్ చెప్పినట్టుగానే తాజాగా సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌కు కోటి రూపాయలను బహుమతిగా ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం.

ఇటీవలే గద్దర్ అవార్డుల వేడుకలోనే రాహుల్‌ సిప్లిగంజ్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అవార్డు ఇవ్వకపోయినా ఏదో ఒకటి ఇవ్వాలని సీఎం చెప్పగా.. దానికి డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క తల ఊపుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -