నవతెలంగాణ-హైదరాబాద్ : మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నుండి ఊరట లభించింది. బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ఎన్జీటీ కొట్టివేసింది. దీంతో మూసీ ప్రక్షాళన పనులకు ఉన్న ప్రధాన న్యాయపరమైన అడ్డంకి తొలగిపోయినట్లయింది. అయితే, ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని కార్తిక్ రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్ను విచారించిన ట్రిబ్యూనల్ పిటిషనర్ తన వాదనలకు సంబంధించి ఎటువంటి సరైన సాంకేతిక లేదా శాస్త్రీయ ఆధారాలను సమర్పించలేదని ఎన్జీటీ పేర్కొంది. ఈ తీర్పుతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మూసీ నది అభివృద్ధి పనులు ముందుకు సాగే అవకాశం ఉంది.
మూసీ సుందరీకరణపై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



