- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : యాసంగి సీజన్ రైతు భరోసా డబ్బులను (ఏడాదికి ఎకరానికి రూ.12,000) సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా రైతులు, పంట డేటా సిద్ధం చేస్తోంది. జనవరి రెండో వారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనుంది. పంటలు సాగు చేయని భూములను రైతు భరోసా నుంచి మినహాయించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
- Advertisement -



