Thursday, July 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య కార్డు ట్రయల్ రన్ సర్వే ...

తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య కార్డు ట్రయల్ రన్ సర్వే …

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్ వాయి పరిధిలోని డిచ్ పల్లి మండలంలోని సుద్ధపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య కార్డ్ ట్రయల్ రన్ సర్వే కార్యక్రమంలో అసంక్రమిత వ్యాధులైన హైపర్ టెన్షన్, డయాబెటిక్, క్యాన్సర్, పాల్యెటివ్ కేర్ లాంటి వ్యాధులతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులు (30) సంవత్సరములు దాటిన ప్రతి ఒక్కరిని ఇంటింటికి తిరిగి బీపీ, గ్లూకోమీటర్ చే ఆర్. బి. ఎస్ ( డయాబెటిక్)పరీక్ష, బరువు, ఎత్తులను, నోటి క్యాన్సర్ పరీక్షలను, రొమ్ము క్యాన్సర్ పరీక్షలను నిర్వహించినట్లు మండల అరోగ్య విస్తరణ అధికారి వై శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరి ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత అలవాట్లు బీఎం ఐ( బాడీ మాస్ ఇండెక్స్ ) పొగ త్రాగడం అలవాటు ఉందా ఎన్ని సంవత్సరాల నుండి పొగ త్రాగుతున్నారు. ఆల్కహాల్ తీసుకోవడం అలవాటు ఉందా తంబాకు లేదా గుట్కా పాన్ తినడం అలవాటు ఉందా ఇలాంటి వివరాను ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య సిబ్బందిచే నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు అక్బర్ అలీ, దేవపాలం ఎం.ఎల్.హెచ్.పి లు ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -