Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుదేశానికే ఆదర్శం తెలంగాణ ప్రభుత్వం 

దేశానికే ఆదర్శం తెలంగాణ ప్రభుత్వం 

- Advertisement -

– కాంగ్రెస్ లో ఉన్న అన్ని వర్గాల నాయకులు బీసీ రిజర్వేషన్ కు జై అంటున్నారు 
– వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీయే ప్రధాని 
– బిజెపి నాయకులు దేవుళ్ళ పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు 
– బండి సంజయ్ నేను సెక్యూరిటీ లేకుండా వస్తాను నువ్వు వస్తావా 
– టి పి సి సి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 
నవతెలంగాణ –  కామారెడ్డి

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈనెల 15న కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ డిక్లరేషన్ సభను ఏర్పాటు చేసేందుకు ఆదివారం జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన సన్మాక సమావేశానికి ఆయన ముఖ్య అతిథి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ

 ఇచ్చిన హమీ లో ప్రధానమైన బీసీ డిక్లరేషన్ పై అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. ఆ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ ఉందన్నారు. కేంద్రం బిల్లును పెండింగ్ లో పెట్టిన దానిని అసెంబ్లీలో తీర్మాణం ప్రకారం అమలు చేసి తీరుతామని అన్నారు. కేంద్రం బీసీలపట్ల ఉన్న వివక్షతను ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి బీసీ డిక్లరేషన్ పై వివరణ ఇచ్చి ఈ నెల 15న నిర్వహించే బిసి డిక్లరేషన్ సమావేశానికి లక్షకు పైగా ప్రజలు అచ్చే విధంగా చూడాలన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో పాస్ చేయగానే బిజెపి నాయకలకు ఏం మాట్లాడాలో తెలియకుండా పోయింది అన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ కి మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు, నేను నాకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బయట రోడ్డుపై తిరుగుతాను నువ్వు కూడా తిరగాలని అన్నారు. మేము ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటున్నామని పేర్కొన్నారు. మేము ఓట్లు అడగడానికి వెళితే దేవుళ్ళ పేరు చెప్పమని, మేము చేసిన అభివృద్ధి ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలను వివరించి ఓట్లు అడుగుతామన్నారు.

కామారెడ్డి వేదికగా ప్రజలకు ఇచ్చిన హమీని అమలు చేస్తున్నామని అందుకే లక్ష మందితో సంబరాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మళ్లిఖార్జున్ ఖర్గేలతో పాటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, సిద్ధ రామయ్యలు హాజరు అవుతారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలోనే బిసీలకు రిజర్వేషన్ అమలు చేసి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి నిరూపించుకుంటుందన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరగనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఒక నిజాయితీ నిబద్ధతతో గల పార్టీ అని ఆ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే అందులో ఎవరైనా ఆ నిర్ణయాన్ని సమర్థించడం జరుగుతుందని బిసి డిక్లరేషన్ పై కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి, బ్రాహ్మణ, ఎస్టి, మైనారిటీ తదితర నాయకులు బీసీ డిక్లరేషన్కు కట్టుబడి ఉన్నారన్నారు. బండి సంజయ్ ఒక బీసీ అయి ఉండి బిసి రిజర్వేషన్ క

 అడ్డుపడుతున్నాడన్నారు. అనంతరం ఈ సమావేశానికి హాజరైన మంత్రులు కొండా సురేఖ, శ్రీహరి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్, జహీరాబాద్ ఎంపీ ఎంపీ సురేష్ షెట్కర్, నిజాంబాద్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తదితరులు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ బిల్లును ఆపాలని అటు బిజెపి, ఇటు బిఆర్ఎస్ పార్టీలు కృషి చేస్తున్నాయని, వారిద్దరికీ బుద్ధి చెప్పాలంటే బీసీ డిక్లరేషన్ సభ విజయవంతం కావాలన్నారు. అందుకు ప్రతి కార్యకర్త గ్రామాలకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ బీసీ డిక్లరేషన్ను వారికి వివరించి ఈ నెల 15న జరిగే బీసీ డిక్లరేషన్ సభకు లక్ష నుండి రెండు లక్షల వరకు మంది వచ్చేలా చూడాలన్నారు.

ఈ సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మర్ వెంకట్, ఏనుగు రవీందర్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి, కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలా శ్రీనివాసరావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ  చంద్రశేఖర్ రెడ్డి, బీబీపేట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుతారి రమేష్,  కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, మాజీ జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad