– ఆ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఒంటెద్దు నరేందర్, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ తీపిరిశెట్టి
నవతెలంగాణ-హైదరాబాద్
సంచార జాతుల వారికి ఎన్నికల మ్యానిఫెస్టోలో ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తామని ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని, రాబోయే ఎన్నికల్లో వారికి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు వెళ్లాలని సంచార జాతుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఒంటెద్దు నరేందర్, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ తీపిరిశెట్టి అన్నారు. బీసీల కులాలను ఏ, బీ, సీ, డీ లుగా ఎలా వర్గీకరణ చేశారో అదేవిధంగా సంచార జాతులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రిజర్వేషన్ తో 42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో హైకోర్టు ద్వారానే పిటిషన్ వేసి తాడోపేడో తేల్చుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యా, ఉద్యోగం, ఉపాధి రాజకీయాలలో ప్రత్యేక అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సింగజోగి శ్రీనివాస్, కోశాధికారి సిద్దుల రవీందర్, ఉపాధ్యక్షులు పన్నీరు నాగేశ్వరరావు, మహిళా విభాగం అధ్యక్షులు కోట అనిత తదితరులు పాల్గొన్నారు.
సంచార జాతులను మోసం చేస్తోన్న తెలంగాణ ప్రభుత్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES