Wednesday, May 14, 2025
Homeట్రెండింగ్ న్యూస్రైతులకు అలర్ట్.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

రైతులకు అలర్ట్.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్ల పై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా సాగుతోందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 61.45 శాతం యాసంగి వడ్ల కొనుగోళ్లు పూర్తయ్యాయి. మే 12వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 43.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. నిరుడు 2023‌‌–24 సంవత్సరం ఇదే సమయానికి 29.88 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. 2022–23లో 19.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఎక్కువ కొనుగోలు కేంద్రాలను నెలకొల్పింది. 2023‌‌–24లో 7178 కేంద్రాలు ఏర్పాటు చేయగా… ఈసారి 8245 కేంద్రాలు నెలకొల్పింది. ఈ ఏడాది యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 60.14 లక్షల ఎకరాల్లో వరి సాగయింది. మొత్తం 1.29 కోట్ల మెట్రిక్​ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. మొత్తం 70.13 లక్షల మెట్రిక్​టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -