- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులు, బంధువులు లేని పిల్లలకు ఇక నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందని మంత్రి దామోదర్ తాజాగా వెల్లడించారు. ఈ క్రమంలోనే రిజిస్టర్డ్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లలో నివసిస్తున్న 2,215 మంది అనాథ పిల్లలను రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. వారికి ఆరోగ్య శ్రీ కార్డులను హైదరాబాద్లో అందజేశారు. దీంతో అనాథ పిల్లలకు ఆరోగ్య శ్రీ కార్డులు ఇచ్చిన తొలి జిల్లాగా హైదరాబాద్ నిలిచింది.
- Advertisement -