Tuesday, December 30, 2025
E-PAPER
Homeజిల్లాలుసంక్రాంతికి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్

సంక్రాంతికి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్:

సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే వాహనాల టోల్ ఛార్జీలను తెలంగాణ ప్రభుత్వమే భరించనుంది. హైదరాబాద్ నుంచి ఏపీకి, తెలంగాణలోని గ్రామాలకు వెళ్లే ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పండుగ సమయంలో టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ సమస్యను నివారించేందుకు, ఐదు నుంచి ఏడు రోజుల వరకు టోల్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించే ప్రతిపాదనను కేంద్రానికి పంపింది. దీనికి కేంద్రం నుంచి అనుమతి లభించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం మధ్యతరగతి ప్రజలకు ఊరటనిస్తుందని భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -