- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కీలక నిర్ణయం తీసుకుంది. 2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఎన్. శ్వేత, ఆర్. భాస్కరన్, జి. చందన దీప్తి, కల్మేశ్వర్ శింగెనవర్, ఎస్.ఎం. విజయ్ కుమార్, రోహిణి ప్రియదర్శిని అనే ఆరుగురు ఐపీఎస్‌లను డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్థాయికి ఎంపిక చేసి పదోన్నతి కల్పించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణ రావు ఈ ఉత్తర్వులను జారీ చేశారు. వీరంతా 2026 జనవరి 1 నుంచి కొత్త హోదాలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
- Advertisement -



