- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
మండల కేంద్రంలోని రెంజల్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఎన్. గీతకు ఖాతాదారులు శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు. గత మూడు సంవత్సరాలుగా ఖాతాదారులకు సేవలను అందించి మరో బ్రాంచ్ కు బదిలీ కావడంతో ఆమెను ఘనంగా సన్మానించారు. బ్యాంకు మేనేజర్ గా రాజేష్ బాధ్యతలను చేపట్టగా ఇరువురికి సన్మానం జరిపినట్లు రెంజల్ సింగిల్ విండో మాజీ చైర్మన్ ఆసాని ప్రశాంత్, అమ్రాది శేఖర్, వేణు, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -