Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రపంచంలో ఎక్కడ లేని సాంప్రదాయం తెలంగాణ ఉంది

ప్రపంచంలో ఎక్కడ లేని సాంప్రదాయం తెలంగాణ ఉంది

- Advertisement -

ప్రిన్సిపల్ తోటకూర యాదయ్య…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

ఆషాడ మాసంలో అంటువ్యాధులు రాకుండా ఉండేందుకు బోనాల పండుగ ద్వారా పరిశుభ్రతను పాటించడం ద్వారా ప్రపంచంలో ఎక్కడి లేని సాంప్రదాయం తెలంగాణ రాష్ట్రంలో ఉందని శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ ప్రిన్సిపాల్ యాదయ్య అన్నారు. శుక్రవారం భువనగిరి జిల్లా కేంద్రం శివారులోని శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ లో ఘనంగా బోనాల ఉత్సవాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాల ప్రాముఖ్యతను వివరిస్తూ, ఆషాడ మాసంలో అంటూ వ్యాధులు రాకుండా నివారణ కోసం అమ్మవారిని పసుపు, కుంకుమలతో  పూజించి, వేపాకులతో బోనాలను అలంకరించి, అమ్మవారికి సమర్పిస్తారని అన్నారు. ఉత్సవాలలో భాగంగా  విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో అమ్మవారికి బోనాలు సమర్పించి, విద్యార్థులు పోతురాజుల వేషాధారణతో అందరినీ ఆకట్టుకున్నారు. విద్యార్థులు శాంప్రదాయ సాంస్కృతిక నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,  విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -