Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణ ఒక ప్రతిభ కలిగిన మహిళ మేధావిని కోల్పోయింది : కేటీఆర్

తెలంగాణ ఒక ప్రతిభ కలిగిన మహిళ మేధావిని కోల్పోయింది : కేటీఆర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్ : సీనియర్ మహిళా జర్నలిస్ట్, టీవీ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ మరణం పట్ల భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. స్వేచ్ఛ ధైర్యంగా ప్రశ్నించే జర్నలిస్ట్, నిబద్ధత గల రచయిత్రి, తెలంగాణ పట్ల అపారమైన ప్రేమ కలిగిన తెలంగాణ వాది అనీ, ఆమె అకాల మరణం విని తీవ్ర ఆవేదనకు లోనయ్యాను అని కేటీఆర్ తెలిపారు. మాటలు రావడం లేదన్నారు. తెలంగాణ ఒక ప్రతిభ కలిగిన మహిళ మేధావిని కోల్పోయిందిని కేటీఆర్ ఆవేదన చెందారు.
ఈ విషాద సమయంలో స్వేచ్ఛ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ఆమె కుమార్తెకూ, తల్లికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఇంతటి బరువైన విషాదకర సమయంలో వారి కుటుంబం స్థైర్యాన్ని పొందాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపిన కేటీఆర్, స్వేచ్ఛ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
జీవితంలో తీవ్రమైన ఒత్తిడులు ఎదురవుతున్నవారు ఎవరైనా ఒంటరిగా ఉండకండి. దయచేసి నిపుణుల సహాయం తీసుకోండి. ఎన్ని కష్టాలున్నా, జీవితాన్ని ముగించాలన్న ఆలోచన ఎవరి మనసులోనూ రాకూడదని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad