- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు జడ్జి గిరిజాప్రియదర్శిని మృతిచెందారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి ఆదివారం తుదిశ్వాస విడిచారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. 2022 మార్చిలో ఆమె తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె మృతిపట్ల న్యాయమూర్తులు, న్యాయవాదులు, పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
- Advertisement -