- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : గ్రూప్-1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు.. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు మరికొందరు వేర్వేరుగా దాఖలు చేసిన పలు పిటిషన్లపై హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. సంబంధిత పిటిషన్లపై జులై 7న వాదనలు విన్న జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తీర్పు ఇవ్వనున్నారు. ఇప్పటికే గ్రూప్-1 పరీక్షల ఎంపిక ప్రక్రియ పూర్తయినప్పటికీ హైకోర్టులో కేసు విచారణ దృష్ట్యా కమిషన్ నియామక ఉత్తర్వులు జారీ చేయలేదు.
- Advertisement -