నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణంలోనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను సన్మానించి కృతజ్ఞతలు తెలిపిన రాజన్న సిరిసిల్ల జిల్లా బిసి సంఘం నేతలు.. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలపడం చారిత్రాత్మక నిర్ణయం, వెనుకబడిన వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్లవేళలా ఉంటుంది ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కుల గణన చేయాలనీ రాహులు గాంధీ ఆలోచనను ప్రజా ప్రభుత్వం అమలు చేసింది,దేశం లోని అందరికీ సమాన హక్కులు ఉండాలని రాహుల్ గాంధీ సంకల్పించారు అని తెలిపారు. బీజేపీ ప్రభుత్వంలో మూడు సంవత్సరాల క్రితం రాజ్ నాథ్ సింగ్ మేమూ కుల గణన కు వ్యతిరేకం అని కోర్టు లో కేస్ వేశారు, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర.. భారత్ జోడో యాత్ర చేసి దేశ ప్రజల ఆకాంక్షలను రాహుల్ గాంధీ తెలుసుకున్నారు అని వెల్లడించారు. తాము అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని ఆయన ప్రకటించారు.రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ చేశాం అని చెప్పారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని నాడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు,ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్‌కు అనుగుణంగా సామాజిక, ఆర్థిక, విద్యా, ఆర్థిక, ఉద్యోగ రాజకీయ, కుల సర్వే ప్రక్రియ చేపట్టడం జరిగింది.బీసీలకు రిజర్వేషన్లు 42 శాతం అమలు చేయడం ఒక చారిత్రాత్మక నిర్ణయం అని తెలిపారు.దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఒక రోల్ మోడల్ గా ఉంది,కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో బీజేపీ ఎంపిలు విఫలం అయ్యారు అని హెద్దేవా చేశారు.బిజేపి వారు షెడ్యూల్ 9 లో బీసీ బిల్లు చేర్చి మి చిత్త శుద్దినీ నిరూపించుకోవాలి, బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎప్పటికైనా మి నాయకులను ఒప్పించాలి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వాళ్ళు చేస్తే ఒప్పు మితగా వారు చేస్తే తప్పా.. బండి సంజయ్ సమాధానం చెప్పాలి అని కోరారు.తెలంగాణ రోల్ మోడల్ అయ్యాక బిజేపి దిగి వచ్చింది.
ఈ మధ్య బిజేపి బిఆర్ఎస్ వారు కొత్త పల్లికి ఎత్తుకున్నారు తీవ్రంగా విమర్శించారు.బీజేపీ వారిని ఏమన్నా అంటే దేశాన్ని, మతాన్ని అన్నట్లు, బిఆర్ఎస్ వారిని అంటే తెలంగాణ ప్రజలను అన్నట్లా..ఇదెక్కడి విడ్డూరం. 2018 పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరిస్తూ నూతన చట్ట చేస్తున్నాం..తెలంగాణలో ఉన్న బిసి సంక్షేమ సంఘాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కృజ్ఞతలు తెలిపారు.రాబోవు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదాలు అందజేయాలి అని ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు వీరవేణి మల్లేష్ యాదవ్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్, సీనియర్ నాయకులు చిలుక రమేష్, సాయికుమార్ , నంద్యాడాపు శ్రీనివాస్, నాయకులు కంచర్ల రాజు, తోట్ల రాములు యాదవ్ ,బోయిన శ్రీనివాస్, ఇల్లంతకుంట తిరుపతి, కుసుమ ప్రభాకర్, రాజు, బూర ఆంజనేయులు, దేవనపల్లి శ్రీకాంత్, చిందం శ్రీధర్ తోపాటు తదితరు ఉన్నారు. పాల్గొన్నారు.