Friday, September 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకులగణనలో దేశానికే తెలంగాణ రోల్‌ మోడల్‌

కులగణనలో దేశానికే తెలంగాణ రోల్‌ మోడల్‌

- Advertisement -

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఈ నెల15న కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకాటి శ్రీహరి, కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్‌ రెడ్డి ,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌ అలీ, శాసనసభ్యులు మదన్‌మోహన్‌ రావు తదితరులతో కలిసి ఆయన సమీక్షించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లను బీసీల కోసం తీసు కొస్తుంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఈ సందర్భంగా తెలిపారు. కామారెడ్డి వేదికగా ఇచ్చిన బీసీ కులగణన హామీని సీఎం రేవంత్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ నేతృత్వంలో సాధించామని వివరించారు. కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభ చాలా ప్రతిష్టాత్మకమైందనీ, ఈ సభను విజయవంతం చేయటానికి చర్చించామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -