Sunday, May 18, 2025
Homeరాష్ట్రీయంప్రపంచానికి తెలంగాణ రోల్‌మోడల్‌

ప్రపంచానికి తెలంగాణ రోల్‌మోడల్‌

- Advertisement -

– సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

వివిధ రంగాల్లో ప్రపంచానికి తెలంగాణ రోల్‌ మోడల్‌గా ఉండాలన్నది తన ఆకాంక్ష అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దుబాయిలో జరిగిన అంతర్జాతీయ పోలీసు సమ్మిట్‌లో ఎక్సలెన్స్‌ ఇన్‌ యాంటీ నార్కొటిక్స్‌ అవార్డును హైదరాబాద్‌ నార్కొటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చీఫ్‌ సీవీ ఆనంద్‌ అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని శనివారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మాదకద్రవ్యాల నియంత్రణలో 138 దేశాలతో పోటీ పడి తెలంగాణ పోలీస్‌ ప్రపంచంలో నెంబర్‌ వన్‌ స్థానాన్ని సాధించడం గర్వంగా ఉందని తెలిపారు. ఈ ఘనతను సాధించిన హైదరాబాద్‌ నార్కొటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చీఫ్‌ సీవీ ఆనంద్‌కు, ఆయన బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. డ్రగ్స్‌ ఫ్రీ తెలంగాణ కోసం తాను కంటున్న కలలను సాకారం చేయడానికి కృషి చేస్తున్న ప్రతి పోలీస్‌కు మద్దతుగా ఉంటానన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -