లోకేశ్ వ్యాఖ్యలకు ఖండన
కేంద్ర పర్యావరణ శాఖ, జీఆర్‌ఎంబీ సైతం వద్దన్నాయి : నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ విమర్శ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. అన్ని రకాలుగా ఈప్రాజెక్టు సమర్థనీయం కాదన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ బనకచర్లపై ఏపీ మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యలను ఖండించారు. కేంద్ర పర్యావరణ శాఖతోపాటు గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు. స్వయంగా తాను కేంద్రానికి లేఖలు రాసినట్టు ఈ సందర్భంగా మీడియాకు లేఖలు విడుదల చేశారు. బనకచర్ల ప్రతిపాదిత ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్, జలసంఘం చైర్మెన్‌కు లేఖలు రాసినట్టు వివరించారు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వ విధానం స్పష్టంగా ఉందని అభిప్రాయ పడ్డారు. బీఆర్‌ఎస్ నిరాధార ఆరోపణలు ప్రచారం కోసం మాత్రమేనని చెప్పారు. బీఆర్‌ఎస్ సర్కారు తన హయాంలో జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నా రు. బీఆర్‌ఎస్‌వి గాలి మాటలు తప్ప వాస్తవం లేదని అభిప్రాయ పడ్డారు. బనకచర్లను అడ్డుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుతో పొత్తు ఉందని లోకేశ్ ఇష్టం వచ్చినట్టు మాటా ్లడుతున్నారని అన్నారు. ఇది ప్రజాస్వామ దేశమనీ, పొత్తు ఉందని అడ్డగోలుగా మాట్లాడరాదని హితవు పలికారు. పోలవరం-బనకచర్ల న్యాయసమ్మతం కాదనీ, అక్రమ ప్రాజెక్టు అని అభిప్రాయపడ్డారు. 650 పేజీలతో కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఆదివారం అధ్యయన కమిటీతో భేటీ అవుతానని చెప్పారు. ఈనెల 4న క్యాబినెట్‌లో చర్చించాల్సిన విషయాల పై చర్చిస్తామని చెప్పారు. తమకు అన్ని అంశాలపై స్పష్టత ఉందనీ, ఆమేరకే ముందుకుపోతామని వివరించారు.
బనకచర్లకు తెలంగాణ వ్యతిరేకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES