Friday, December 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోంది..అసెంబ్లీకి కేసీఆర్..!

తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోంది..అసెంబ్లీకి కేసీఆర్..!

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పార్టీ సీనియర్‌ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం ముగిసింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల తదుపరి కార్యాచరణపై నేతలతో చర్చించారు. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. తెలంగాణకు కాంగ్రెస్‌ ఎప్పుడూ ద్రోహమే చేస్తోంది. బీఆర్‌ఎస్‌కు తప్ప.. మరే ఇతర పార్టీకి తెలంగాణపై పట్టింపులేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టాల్సిందే. ప్రజల్లోకి వెళ్దాం. ఉద్యమాన్ని నిర్మిద్దాం. నీటి హక్కులు పరిరక్షించుకునే బాధ్యత బీఆర్‌ఎస్‌పైనే ఉంది. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా వివరిద్దాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ద్రోహాన్ని అసెంబ్లీ వేదికగా చెబుదాం’’ అని పార్టీ నేతలతో కేసీఆర్‌ అన్నట్టు సమాచారం. ఈనెల 29న శాసనసభకు కేసీఆర్‌ హాజరయ్యే అవకాశముందని, అసెంబ్లీ సమావేశాల తర్వాత బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలు ఉంటాయని పార్టీ నేతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -