స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ లక్ష్మి కొర్ర
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
చిత్రకళకు తెలంగాణ పుట్టినిల్లని తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మి కొర్ర అన్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో అంతర్జాతీయ చిత్రకారుడు కట్టకూరి రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ”నేషనల్ సోలో ఎగ్జిబిషన్-2025”ను మంగళవారం సందర్శించారు. చిత్రాల ముఖ్య ఇతివృత్తం స్త్రీ సౌందర్యం… జీవం ఉట్టిపడే రీతిలో తీర్చిదిద్దిన చిత్రాలను ఆద్యంతం కలియ తిరిగి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే రీతిలో రూపొందించిన కళా ఖండాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లో… ప్రత్యేకించి హైదరాబాద్‌లో చిత్రకళకు అత్యంత ఆదరణ ఉందని అన్నారు. చిత్రకళలో కృషి చేస్తున్న వారికి అవసరమైన సహాయ, సహకారాలు ప్రభుత్వ పరంగా అందిస్తామని ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ యలమద్ధి నాగేశ్వరరావు, పలువురు విశిష్ట కళాకారులు పాల్గొననున్నారు.
చిత్రకళకు పుట్టినిల్లు తెలంగాణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES