Saturday, February 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమున్సిపల్‌ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి బోణి

మున్సిపల్‌ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి బోణి

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మున్సిపల్‌ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి బోణి కొట్టింది. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతిచ్చిన పలువురు ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ సింహం గుర్తు కామన్‌ సింబల్‌పై పోటీ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే రాజకీయ పార్టీని పెట్టబోతున్నట్టు ఆమె ఇప్పటికే ప్రకటించారు. కవిత మున్సిపల్‌ ఎన్నికల్లో నిలబడ్డ ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థులతో పాటు స్వతంత్రులకు మద్దతిస్తున్నట్టు స్పష్టంగా తెలిపారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రజలు ప్రశ్నించే గొంతులను గెలిపించాలని ఆమె సూచించారు. తాజా ఫలితాల్లో జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాల్టీలో ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ (ఏఐఎఫ్‌ బి)నుంచి 8 వార్డుల్లో అభ్యర్థులు గెలిచారని జాగృతి రాష్ట్ర నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

భౌరాపూర్‌ జాతరకు నిధులివ్వాలి :కల్వకుంట్ల కవిత
భౌరాపూర్‌ జాతరకు నిధులు విడుదల చేయాలని.. ఆదివాసీ చెంచుల జాతరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఆమె ట్వీట్‌ చేశారు. ”నల్లమల పులి బిడ్డ అని చెప్పుకునే ముఖ్యమంత్రి భౌరాపూర్‌ జాతరకు ఎందుకు నిధులు విడుదల చేయడం లేదు?. మహా శివరాత్రికి భౌరాపూర్‌ భ్రమరాంబ అమ్మవారి ఆలయంలో ఆదివాసీ చెంచులు అత్యంత వైభవంగా జాతర జరుపుకుంటారు. ఈ అమ్మ వారిని చెంచులు తమ ఇంటి ఆడబిడ్డగా కొలుచుకుంటారు.. ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ జాతరపై నిర్లక్ష్యం ఎందుకు?. ” అని ఆమె విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -