Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జయశంకర్ కు ఘన నివాళులు 

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జయశంకర్ కు ఘన నివాళులు 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నగరం లోని కంటేశ్వర్ చౌరస్తా వద్ద జయశంకర్ ఘన నివాళులు బుధవారం అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ అవంతి రావు మాట్లాడుతూ..తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, అసమానతలను ఎత్తిచూపుతూ, తెలంగాణ ప్రజలలో చైతన్య దివిటీ వెలిగించిన గొప్ప మేధావి ప్రొఫెసర్ జయశంకర్. వలస పాలకుల చెరలో బందీ అయిన తెలంగాణ తల్లి విముక్తి కోసం ఆయన తిరగని ప్రాంతం లేదు. సమస్త వనరుల సిరుల మాగాణమైన తెలంగాణ యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని అనుక్షణం పరితపించారు.

మలి దశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ కి మార్గదర్శిగా సమస్త తెలంగాణకు మార్గనిర్దేశకుడిగా ఆయన చేసిన కృషి సదా స్మరణీయం అని తెలియజేశారు.జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పని చేసిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ భరద్వాజ్ , డాక్టర్ పులి జైపాల్ , శ్యామల సాయి కృష్ణ, కుల్దీప్, హరీష్ యాదవ్ ,సంపత్, సందీప్, విక్కీ శోభ, రేఖ, సరిత, రాణి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -