Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రేపటి నుంచి తెలంగాణ పనుల జాతర ప్రారంభం.!

రేపటి నుంచి తెలంగాణ పనుల జాతర ప్రారంభం.!

- Advertisement -

ఉపాధి హామీ, గ్రామీణాభివృద్ధి శాఖ..
నవతెలంగాణ – మల్హర్ రావు

గ్రామీణాభివృద్ధి శాఖ-మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం- ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి 2025  తెలంగాణ-“పనుల జాతర,, లో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లుగా ఉపాధిహామీ, గ్రామీణాభివృద్ధి అధికారులు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న నిరుపేద కూలీ కుటుంబాల జీవనోపాదులను మెరుగుపరచడానికి ఒక ఆర్థిక సంవత్సరములో 100 రోజుల కనీస కూలీ పని కల్పించడానికి 2025-26వ ఆర్థిక సంవత్సరానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు.2025లో భాగంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరింత అంకితభావంతో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి గ్రామీణ ప్రాంతాలలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించడానికి రాష్ట్ర మంత్రి,ఎమ్మెల్యే, ఎంపీ తోపాటు స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించినట్లుగా తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ,స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ్), ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖల సమన్వయంతో “పనుల జాతర 2025″కు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు.

పనులు ఇలా…

ఈఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే నూతన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలకు,అంగన్వాడి భవనాల నిర్మాణాలకు,స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ్) ద్వారా నిర్మించే ప్లాస్టిక్ వేస్ట్ యూనిట్, సగ్రిగేషన్ పెడ్, కమ్యూనిటీ సానిటర్ కాంప్లెక్స్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా గ్రామీణ రహదారుల నిర్మాణం (సిఆర్ఆర్) నిధులతో కొత్తగా చేపట్టి పనులకుశంకుస్థాపనలు చేయబడతాయి(273) పనులకు రూ.4.08 కోట్ల వ్యయంతో పనులు మొదలు పెడుతున్నట్లుగా తెలిపారు.ఇప్పటికే పూర్తి అయిన గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలను, గ్రామీణ రహదారుల,సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఇందిరా మహిళా శక్తి ఉపాధి భరోసా” క్రింద చేపట్టే పలు జీవనోపాధి అభివృద్ధి పనులు (వ్యక్తిగత ఆస్తుల కల్పన) ముఖ్యంగా స్వయం సహాయక మహిళలకు పశువుల కొట్టాల నిర్మాణం, కోళ్ల షెడ్లు నిర్మాణం,గొర్రెల షెడ్ల నిర్మాణం,పండ్ల తోటల పెంపకం,వానపాముల ఎరువుల తయారీ నిర్మాణం, ఆజోలా పిట్ల నిర్మాణం లాంటి పనులు మంజూరీ ఉత్తర్వులను సమావేశంలో లబ్దిదారులకు అందచేస్తామన్నారు.

జిల్లా వ్యాప్తముగా 1075 లబ్దిదారులను గుర్తించి రూ.3.93 కోట్ల రూపాయలతో పనులు మొదలు పెట్టడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు అనగా ఏప్రిల్ 1వ తేది నుండి ఆగష్టు మాసపు 20 తేది వరకు సామజిక మరియు వ్యక్తిగత పనులకు (856)గాను రూ.41.69 కోట్లతో పనులు చేయించడం జరుగుతుందన్నారు.ప్రతి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంలో వ్యక్తిగత లబ్దిదారులకు చెందిన కనీసం ఒక పనిని నేడు శంకుస్థాపన చేయిస్తామన్నారు.పల వనాలు వన మహోత్సవం ఈత మొక్కల పెంపకం, తాటి చెట్ల పెంపకం, పండ్ల తోటల లాంటి పనుల మంజూరీ ఉత్తర్వులను సమావేశంలో లబ్దిదారులకు అందచేస్తామన్నారు.

జల నిది: నీటి సంరక్షణ, భూగర్భ జలాలు పెంచే పనులను చేపట్టిన లబ్దిదారులను గుర్తించి వారికి సన్మానం చేస్తామన్నారు.గత ఆర్థిక సంవత్సరములో ఎక్కువ పని రోజులు చేసిన దివ్యాంగుల కుటుంబాలను గుర్తించి వారిని సన్మానిస్తామన్నారు.గ్రామంలో నిబద్ధతతో పనిచేసిన మల్టీపర్సన్ వర్కర్ పారిశుధ్య కార్మికులను గుర్తించి సమావేశంలో సన్మానిస్తామన్నారు.గ్రామంలో స్వచ్ఛందంగా చెట్ల పెంపకంలో పాల్గొని ఇతరుల భాగస్వామ్యంతో పచ్చదనాన్ని పెంచడానికి తోడ్పాటు అందించిన వ్యక్తులను,కుటుంబాలను గుర్తించి వారిని సన్మానిస్తామన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad