Saturday, February 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఘ‌నంగా తెలంగాణ సాహితి ద‌శాబ్ది సాహిత్యోత్స‌వాలు

ఘ‌నంగా తెలంగాణ సాహితి ద‌శాబ్ది సాహిత్యోత్స‌వాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తెలంగాణ సాహితి ద‌శాబ్ది సాహిత్యోత్స‌వాలు హైద‌రాబాద్ ఎవీ కాలేజ్‌లో ఘ‌నం జ‌రుగుతున్నాయి. ముఖ్య అతిథిగా ప్ర‌ముఖ క‌వి, ర‌చ‌యిత నందిని సిద్ధారెడ్డి, గౌరవ అతిథిగా ప్ర‌జావాగ్గేయ‌కారుడు, ఎమ్మెల్సీ గోరెటి వెంక‌న్న హాజ‌ర‌య్యారు. విశిష్ట అతిథులుగా తెలంగాణ భాషా సాంస్కృతిక సంచాల‌కులు ఏనుగు న‌ర్సింహారెడ్డి, చాకలి ఐల‌మ్మ మ‌హిళా విశ్వ‌విద్యాల‌యం వీసీ సూర్య ధ‌నుంజ‌యల‌తోపాటు ఆత్మీయ అతిథులుగా న‌వ‌తెలంగాణ దిన‌ప‌త్రిక‌ ఎడిట‌ర్ రాంప‌ల్లి ర‌మేష్, రాష్ట్ర గ్రంథాల‌య ఛైర్మ‌న్ డా. రియాజ్, హైద‌రాబాద్ బుక్ ఫెయిర్ అధ్య‌క్షుడు యాకూట్ త‌దిత‌రలు పాల్గొన్నారు. సాహితి ద‌శాబ్ది సాహిత్యోత్స‌వాలు సంద‌ర్భంగా స‌మ‌గ్ర సాహిత్యోత్స‌వాల పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు. స‌భాధ్య‌క్షులుగా తెలంగాణ సాహిత అధ్య‌క్షులు, న‌వ‌తెలంగాణ బుక్ హోస్ ఎడిట‌ర్ కె.ఆనందాచారి వ‌హించ‌గా, వేదిక‌పై అతిథిలను ర‌చ‌యిత అనంతోజు మోహ‌న్ కృష్ణ ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మానికి వివిధ ప్రాంతాల‌నుంచి ఆయా ర‌చయిత‌లు, క‌వులు, యువ‌కులు, సాహితీ అభిమానులు, విద్యార్థులు త‌ర‌లివ‌చ్చారు.

స్థానిక ఎవీ కాలేజ్ ప్రాంగ‌ణంలో రెండు(నేడు, రేపు) రోజులు పాటు సాహిత్యోత్స‌వాలు నిర్వ‌హించ‌నున్నారు. మొద‌టి రోజు సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌తో పాటు వివిధ అంశాల‌పై చ‌ర్చ‌గోష్టుల‌ను నిర్వ‌హించారు. సాహిత్యోత్స‌వాలు సంద‌ర్భంగా కాలేజ్ ప్రాంగ‌ణంలో బుక్ స్టాళ్ల‌ను ఏర్పాటు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -