నవతెలంగాణ – మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్ర గణిత శాస్త్ర ఫోరం ఆధ్యంలో నిర్వహించిన ప్రతిభ పాఠవ పరీక్షలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బ ఖల్ వాడిలో చదువుతున్న కే. మేఘన నల్లగొండ జిల్లా నుంచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అలుగుబెల్లి కరుణాకర్ రెడ్డి తెలిపారు. బుధవారం ప్రతిభ కనబరిచిన విద్యార్థిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినీ విద్యార్థులు తమ ప్రతిభను రాబోయే కాలంలో పోటీ ప్రపంచంలో నిలవాలంటే ఇలాంటి పరీక్షలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, గిరిజ శ్రీదేవి, స్వాతి, బాలు, చిన్నయ్య, కర్నాటి శ్రీనివాస్, పంగ సైదులు, చంద్రయ్య, దా శివ, రహీం, సైదా నాయక్, నెహ్రు సునీత ,మాధవి, ఉదయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ గణిత శాస్త్ర ఆధ్వరంలో ప్రతిభా పాటవ పరీక్ష
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



