Friday, November 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంముగిసిన తెలంగాణ నార్త్‌ ఈస్ట్‌ కనెక్ట్‌

ముగిసిన తెలంగాణ నార్త్‌ ఈస్ట్‌ కనెక్ట్‌

- Advertisement -

నిర్వాహకులను అభినందించిన గవర్నర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌లో నిర్వహించిన నార్త్‌ ఈస్ట్‌ కనెక్ట్‌ ఫేస్‌ 2 ముగిసింది. గురువారం నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఈశాన్య రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ నిర్వాహకులను అభినందించారు. రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక సామరస్యతకు కనెక్టివ్‌ ఉపయోగపడిందని తెలిపారు. దీని ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం బాగా సహకరించిందని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ సాంస్కతికంగా బలోపేతం, ఈశాన్య రాష్ట్రాలతో కలిసి అభివృద్ధి చెందాలన్న తమ ఆకాంక్ష ఫెస్టివల్‌లో కనిపిస్తున్నదని చెప్పారు. ఈ ఉత్సవం ఫేస్‌ 2లో వివిధ రంగాల్లో తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల మధ్య 8 ఒప్పందాలు కుదిరాయి. ముగింపు సమావేశంలో గవర్నర్‌ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -