నవతెలంగాణ – హైదరాబాద్: దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న పోలీస్ శాఖగా తెలంగాణ పోలీస్ శాఖ ఆవిర్భవించిందని, అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతోందని డీజీపీ డా.జితేందర్ అన్నారు. సిఐడీ విభాగంలో ఉత్తమ పనితీరును ప్రదర్శించిన 52 మంది పోలీసు సిబ్బందికి డీజీపీ బుధవారం రివార్డులను అందించారు. అధికారులను ప్రశంసాపత్రం, నగదు రివార్డులతో సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డీజీపీ డాక్టర్ జితేందర్ మాట్లాడుతూ.. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారని తెలిపారు. సెల్ ఫోన్ రికవరీలో దేశంలోనే ఈ విభాగం ముందుందని అన్నారు. పోలీసు సిబ్బంది అసాధారణ పనితీరు డిపార్ట్‌మెంట్ విజయానికి గణనీయంగా దోహదపడిందని అన్నారు. ఇదే ప్రతిభను కొనసాగించి మరింతగా తెలంగాణ పోలీస్ ప్రతిష్ట పెంచాలని అధికారులకు సూచించారు.
అత్యుత్తమ పనితీరులో తెలంగాణ పోలీస్ భేష్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES