Saturday, April 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ పోలీసుల హ్యాట్రిక్‌ విజయం

తెలంగాణ పోలీసుల హ్యాట్రిక్‌ విజయం

- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ పోలీసు బృందాలు అల్‌ ఇండియా పోలీస్‌ డ్యూటీ మీట్‌లో వరుసగా మూడోసారి ఓవరాల్‌ ఛాంపియన్‌ ట్రోఫీని గెలుచుకుని హ్యాట్రిక్‌ సాధించాయి. సీఐడీ పర్యవేక్షణలో నిరంతర శిక్షణతో ఈ విజయం నమోదు చేశాయి. వరుస విజయాలతో జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసులు మరో సారి తమ ప్రతిభ చాటుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి రాష్ట్ర పోలీసు బృందానికి శుక్రవారం అభినందనలు తెలిపారు. డీజీపీ శివధర్‌ రెడ్డి, సీఐడీ అడిషనల్‌ డీజీ చారు సిన్హాను అభినందించారు.

ఈ విజయం రాష్ట్ర పోలీసుల కృషి, క్రమశిక్షణకు నిదర్శనమని తెలిపారు. 2024లో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో, 2025లో జార్ఖండ్‌లోని రాంచీలో, 2026లో మహా రాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన 69వ అఖిల భారత పోలీస్‌ డ్యూటీ మీట్‌లో వరుసగా తెలంగాణ ఓవరాల్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి నాగ్‌పూర్‌లో జరిగిన 69వ పోలీస్‌ డ్యూటీ మీట్‌లో రాష్ట్ర బృందం అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఓవరాల్‌ ఛాంపియన్‌ ట్రోఫీతో పాటు యాంటీ-సాబోటేజ్‌ చెక్‌, వీడియోగ్రఫీ, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ విభాగాల్లో విజేతగా నిలిచింది. శాస్త్రీయ దర్యాప్తు సహాయాలు, పోలీస్‌ ఫోటోగ్రఫీ విభాగాల్లో రన్నరప్‌ సాధించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -