Tuesday, September 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ పబ్లిక్‌, ప్రయివేటు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌

తెలంగాణ పబ్లిక్‌, ప్రయివేటు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌

- Advertisement -

రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా ఎస్‌.వీరయ్య, పుప్పాల శ్రీకాంత్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ పబ్లిక్‌, ప్రయివేటు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌(ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌-సీఐటీయూ అనుబందం) రాష్ట్ర అధ్యక్షులుగా ఎస్‌.వీరయ్య, ప్రధాన కార్యదర్శిగా పుప్పాల శ్రీకాంత్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ ఫెడరేషన్‌ యూనియన్‌ మహాసభలు ఈ నెల 20,21 తేదీల్లో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగాయి. అందులో నూతన కమిటీని ఎనుకున్నారు. ఆ ఫెడరేషన్‌ గౌరవాధ్యక్షులుగా వీఎస్‌.రావు, కార్యనిర్వాహక అధ్యక్షులుగా కె.అజరుబాబు, కోశాధికారిగా జిల్లా ఉపేందర్‌, ఉపాధ్యక్షులుగా వీరాంజనేయులు (ఎస్‌డబ్ల్యుఎఫ్‌), సుంచు విజేందర్‌ (జనగామ), వై. విక్రమ్‌ (ఖమ్మం), ఎల్‌. కోటయ్య (హైదరాబాద్‌), జె. రుద్రకుమార్‌ (రంగారెడ్డి), కె. సతీష్‌ కుమార్‌ (హైదరాబాద్‌), ఎం. రాంబాబు (సూర్యాపేట), పెంజర్ల సైదులు (నల్లగొండ), ఎండి. పాషా (భువనగిరి), ఎస్‌. రాము (వనపర్తి), కార్యదర్శులుగా పున్నం రవి (కరీంనగర్‌), చొప్పరి రవికుమార్‌ (సిద్ధిపేట), రామయ్య (నాగర్‌ కర్నూల్‌), ఐ. రమేష్‌ (మేడ్చల్‌), డి. రాందాస్‌ (ఖమ్మం), ఎమ్‌డీ. బషీర్‌ (వరంగల్‌), కటారి రాములు (నిజామాబాద్‌), భానునాయక్‌ (హనుమకొండ), వేల్పుల కుమారస్వామి (పెద్దపల్లి), ఉమేష్‌ రెడ్డి (హైదరాబాద్‌), వెంకటేష్‌ (సంగారెడ్డి), రాజమౌళి (మహబూబాబాద్‌)లతో పాటు 32 మందిని రాష్ట్ర కమిటీ సభ్యులుగా మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది.

మహాసభ తీర్మానాలు

  1. రవాణారంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.
  2. రోడ్డు రవాణారంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే ఎమ్‌వీ యాక్టు బిల్లును ఉపసంహరించుకోవాలి.
  3. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ కోడ్‌లను ఉసంహరించుకోవాలి.
  4. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలి.
  5. ఆర్టీసీ కార్మికులపై వేధింపులు ఆపాలి. యూనియన్లను పునరుద్ధరించాలి.
  6. బడ్జెట్‌లో నిధులు కేటాయించి ఆర్టీసీకి కొత్త బస్సులు కొనాలి. సంస్థను కాపాడాలి.
  7. ఓలా, ఊబర్‌, ర్యాపిడో, పోర్టర్‌ యాప్‌లను రద్దు చేసి వాటి స్థానంలో ప్రభుత్వం కొత్త యాప్‌లను తీసుకురావాలి.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -