నవతెలంగాణ-హైదరాబాద్ : విద్యనగర్ లోని వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల ప్రధానాచార్యులు డా. కె. ప్రభు పాల్గొని,జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ… భారతదేశం 1947 ఆగస్టు 15 రోజు బ్రిటిష్ వారి నుండి విముక్తిని పొందితే, తెలంగాణ ప్రాంతం మాత్రం నిజాం నవాబుల నుండి 1948 సెప్టెంబరు 17 రోజు విముక్తిని పొందిందని, కాబట్టి ఇది తెలంగాణకు ప్రత్యేకమైన దినోత్సవంగా చెప్పారు. ఆ కాలంలో తెలంగాణ ప్రజలు రెండు శక్తుల వలన ఇబ్బంది పడ్డారు. నిజాం నిరంకుశ పాలన మరియు గ్రామాలలో ఉండే దొరలు,దేశ్ ముఖ్ లు,భూస్వాములు, జమీందారులు. ప్రజలు వీరికి అధిక పన్నులు చెల్లించడంతో పాటు వెట్టిచాకిరిని చేశారు. ఆస్తులకు, అక్షరాస్యతకు దూరమైన తెలంగాణ ప్రజానీకం విపరీతమైన దోపిడిని ఎదుర్కొన్నది. ఆంధ్ర మహాసభ ద్వారా ప్రజలు చైతన్యవంతమై ప్రపంచంలోనే ఉన్నతమైన రైతాంగ తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిర్మించారు, కొనసాగించారు. భుక్తి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం వరిసేలలతో తుపాకి గుండ్లకు ఎదురు నిలబడి పోరాడి గెలిచిన ఉద్యమం తెలంగాణ సాయుధ పోరాటం. వారి పోరాటాలతో తలోగ్గిన నిజాం నవాబు, అప్పటి కేంద్ర ప్రభుత్వం జరిపిన సైనిక చర్యకు లొంగిపోయి, తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేశారు. వారి త్యాగాలను నెమరు వేసుకుంటూ , విద్యార్థులందరూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగి, తెలంగాణ ప్రాంతం నిండు అభివృద్ధిని సాధించినప్పుడే వారి కలలు నెరవేరుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉప ప్రధానాచార్యులు డా. ఆర్. లావణ్య, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES