Thursday, January 15, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఎగుమతుల్లో తెలంగాణకు ఎనిమిదో స్థానం

ఎగుమతుల్లో తెలంగాణకు ఎనిమిదో స్థానం

- Advertisement -

2024 నుంచి పెరిగిన ఎక్స్‌పోర్ట్స్‌ విలువ రూ.1.17 లక్షల కోట్లు
మొదటి స్థానంలో మహారాష్ట్ర
తరువాత స్థానాల్లో తమిళనాడు, గుజరాత్‌, యూపీ
ఐదో స్థానంలో ఏపీ…నిటి ఆయోగ్‌ 2024 ఎగుమతుల నివేదిక
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ఎగుమతుల్లో దేశంలో తెలంగాణ రాష్ట్రం ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ మేరకు బుధవారం నిటి ఆయోగ్‌ 2024 ఎగుమతుల నివేదికను విడుదల చేసింది. మొదటి స్థానంలో 68.01 స్కోర్‌తో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. 64.41 స్కోర్‌తో తమిళనాడు రెండో స్థానంలో నిలవగా, 64.02 స్కోర్‌తో గుజరాత్‌, 62.09 స్కోర్‌తో ఉత్తరప్రదేశ్‌తో మూడు, నాలుగో స్థానాల్లోనూ నిలిచాయి. 60.65 స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్‌ ఐదో స్థానంలో ఉంది. 57.14 స్కోర్‌తో తెలంగాణ ఎనిమిదో స్థానంలో నిలిచింది. పెద్ద రాష్ట్రాల్లో జార్ఖండ్‌ (42.49 స్కోర్‌), బీహార్‌ (46.31 స్కోర్‌), రాజస్థాన్‌ (47.31 స్కోర్‌) చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి. చిన్న రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్‌ (52.07 స్కోర్‌), జమ్మూ కాశ్మీర్‌ (51.08 స్కోర్‌), నాగాలాండ్‌ (46.42 స్కోర్‌) మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. లక్ష్యదీప్‌ (22.76 స్కోర్‌), మణిపూర్‌ (28.29 స్కోర్‌), మిజోరం (30.24 స్కోర్‌) చివరి మూడు స్థానాల్లో నిలిచాయి. 2024లో తెలంగాణ నుంచి రూ.1.17 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయి. తెలంగాణ నుంచి యుఎస్‌ఎ (28.17 శాతం), యుఎఈ (6.90 శాతం), చైనా (5.21శాతం), సౌదీఅరేబియా (4.01 శాతం), కువైట్‌ (3.7 శాతం)కు ఎగుమతులు జరిగాయి. ఎరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌, ఎలక్ట్రికల్‌ పరికరాలు, ఫార్మాస్యూటికల్స్‌, వ్యవసాయ ఉత్పత్తులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల నుంచి ఈ ఎగుమతులు ఎక్కువ ఉన్నాయి. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.8 శాతం నుంచి 5 శాతానికి పెరిగింది. 2023-24లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ.14.6 లక్షల కోట్లు చేరింది. 2024లో ఈ రాష్ట్రం మొత్తం రూ.1.1 లక్షల కోట్ల విలువైన ఎగుమతులను రికార్డు స్థాయిలో నమోదు చేసింది. అదే 2023లో రూ.95 వేల కోట్లు ఉండేది. అదే విధంగా ఔషధాలు రూ.24,187 కోట్లు, ఎయిర్‌క్రాఫ్ట్స్‌, స్పేస్‌ క్రాఫ్ట్స్‌, లాంచ్‌ వెహికల్స్‌ రూ.14,670 కోట్లు, నెట్రోజన్‌ హెటెరోసైక్లిక్‌ సమ్మేళనాలు రూ.5,036 కోట్లు, మిరియాలు, క్యాప్సికం రూ.2,273 కోట్లు, యాంటీబయోటిక్స్‌ రూ.1,858 కోట్లు, ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌, స్టాటిక్‌ కన్వెర్టర్స్‌ రూ.1,726 కోట్లు, జ్యూవెల్లరీ ఆర్టికల్స్‌ రూ.1,708 కోట్లు, ఆపరేషన్‌ కోసం మానవ రక్తం రూ.1,569 కోట్లు, బియ్యం రూ.1,094 కోట్లు, కాలబర్‌ నెట్‌వర్క్‌ కోసం టెలిఫోన్‌ సీట్స్‌ రూ.1,049 కోట్లు ఎగుమతులు అవుతున్నాయి. మెదక్‌ నుంచి ఇంజినీరింగ్‌, ఆటో మోటివ్‌ రంగం నుంచి టెక్స్‌టైల్స్‌, లెథర్‌, ఫుడ్‌ ప్రొసెసింగ్‌, హైదరాబాద్‌ నుంచి ఫార్మాస్యూటికల్స్‌, బయోటెక్నాలజీ, ఎరోస్పేస్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమోటివ్‌, రంగారెడ్డి నుంచి ఫార్మాస్యూటికల్స్‌, డిఫెన్స్‌, నల్గొండ నుంచి సిమెంట్‌, ఫార్మాస్యూటికల్స్‌, టెక్స్‌టైల్స్‌ ఎగుమతవుతున్నాయి. తెలంగాణలో ఎగుమతులు 2023లో 2.6 శాతం ఉంటే, 2024లో 3.2 శాతానికి పెరిగినట్టు ట్రెండ్స్‌ స్పష్టం చేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -