మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సర్కార్ ముందస్తు చర్యలు
న్యూఢిల్లీ తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మధ్యప్రాచ్యం (మిడిల్‌ఈస్ట్)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న తెలంగాణ పౌరులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24/7 కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత రాయబార కార్యాలయాలతో ఇప్పటికే నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఆయా దేశాల్లో నివసిస్తున్న, చిక్కుకున్న తెలంగాణ వాసులు, వారి కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను దష్టిలో ఉంచుకుని, అవసరమైన సమన్వయం, సహాయం అందించేందుకు కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఆయా దేశాల్లో ఉన్న రాష్ట్రానికి చెందిన ప్రజల ఇబ్బందులు, ప్రయాణ అంతరాయాలు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైతే కంట్రోల్ రూంను సంప్రదించాలని అధికారులు కోరారు.
కంట్రోల్ రూం ఫోన్ నెంబర్లు
వందన బరువా
పీఎస్‌టూ రెసిడెంట్ కమిషనర్ అండ్ లైజన్ హెడ్
ఫోన్: 91 9871999044
సీహెచ్. చక్రవర్తి
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
ఫోన్: 91 9958322143
జావేద్ హుస్సేన్
లైజన్ ఆఫీసర్
ఫోన్: 9910014749
రక్షిత్ నాయక్
లైజన్ ఆఫీసర్
ఫోన్ :91 9643723157



