Tuesday, November 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ రైజింగ్ - 2047 సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలి: కలెక్టర్

తెలంగాణ రైజింగ్ – 2047 సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలి: కలెక్టర్

- Advertisement -

ఈనెల 25 తో ముగియనున్న సర్వే
నవతెలంగాణ – వనపర్తి  

తెలంగాణా రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వే కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని, జిల్లా ప్రజలు కూడా అందరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. ఇప్పటివరకు ఈ సిటిజన్ సర్వే లో కేవలం తెలంగాణ నుండే వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందచేశారని తెలిపారు. భారత దేశ స్వాతంత్య్రానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుండి తగు సలహాలు, సూచనలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వేను చేపట్టిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25 వతేదీ తో ముగుస్తుందన్నారు. ఈ సర్వే రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉన్నందున www.telangana.gov.in /telanganarising అనే వెబ్సైట్ ను సందర్శించి ప్రతీ ఒక్కరు తమ అమూల్యమైన సలహాలు , సూచనలను అందించాల్సింగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -