నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తలపెట్టిన బందు పోస్టర్ నీ మంగళవారం కొత్త బస్టాండ్ బాబు జగ్జీవన్ రావు విగ్రహం ముందు ఆవిష్కరించారు. జాతీయ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నేత లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. బీసీల హక్కు 42 శాతం రిజర్వేషన్లు రిజర్వేషన్ల కై పోరాడి కొట్లాడు తెచ్చుకుందాం. బిసి రిజర్వేషన్స్ 50 శాతం సీలింగ్ వర్తించినపుడు ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్స్ కూడా చెల్లవు రద్దు చేయండి. అదేవిధంగా ఈ డబ్ల్యూ ఎస్ 10 శాతం రిజర్వేషన్లలో ఓసి అయినటువంటి ముస్లింలు కూడా ఉన్నారు ఇది కూడా బిజెపి నాయకులు గమనించాలి బీసీ 42 శాతం రిజర్వేషన్లలో ముస్లిమ్స్ ఉన్నారని తెలంగాణ బిజెపి కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒకసారి ఆలోచించాలనీ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య యాదవ్ అన్నారు.
బీసీ రిజర్వేషన్లు బీసీల బిక్ష కాదు బీసీల హక్కు అని అన్నారు అదేవిధంగా బిఆర్ఎస్ ,బిజెపి పార్టీలో హైకోర్టులో ఇంప్లిమెంట్ పిటిషన్ కూడా వేయలేదు.ఈ కార్యక్రమంలో బీసీ ప్రజాప్రతినిధులు ,కవులు, కళాకారులు, విద్యార్థులు, మేధావులు ,వక్తలు ,ప్రజా సంఘాల , యువజన నాయకులు ప్రతి ఒక్కరు రాజకీయ పార్టీలకు అతీతంగా మన హక్కుల సాధనకై బందులో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పరాల సాయి. బీసీ యువజన సంఘం నాయకులు ఉప్పుల మధుసూదన్ యాదవ్ ,బీసీ విద్యార్థి సంఘం నాయకుడు బయ్యా రాజేష్ . అఖిలేష్ యాదవ్, నరేష్ ,గణేష్ . యశ్వంతు . గౌతమ్ వెంకన్న శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES