– ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్
నవతెలంగాణ -పరకాల : విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ అన్నారు.సోమవారం హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అలాగే పెండింగ్లో ఉన్న 8 వేల కోట్ల పైచిలుకు స్కాలర్షిప్,
ఫీజు రీయింబర్మెంట్ వెంటనే విడుదల చేయాలన్నారు.విద్యార్థులకు కళాశాలలో మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని పరకాల పట్టణంలో ఎస్ఎఃహెచ్ హాస్టల్ కు సొంత భవనాలు నిర్మించి, గ్రామాల నుండి వచ్చే విద్యార్థులకు సరైన సమయానికి బస్సు ప్రయాణాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థుల పట్ల చిన్నచూపు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని విద్యార్థులను అన్ని విధాల ఆదుకొవాలన్నారు.తక్షణమే విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు మడికొండ ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు బొచ్చు ఈశ్వర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ హేమంత్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.