Thursday, September 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య ,వైద్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య ,వైద్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

- Advertisement -

– తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండలో  మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ 
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య ,వైద్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా మిత్రులతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  .  వైద్య రంగానికి ప్రభుత్వం ప్రతి ఏటా  దాదాపు 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని చెప్పారు. ఈ క్రమంలో ఆరోగ్య శ్రీ, సీఎంఆర్ ఎఫ్ పథకాలపై మరోసారి సమీక్ష  నిర్వహించాలి అని సూచించారు

గతంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య వసతులు తక్కువగా ఉండటం కారణంగా పేదలకు ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స కోసం ఆరోగ్య శ్రీ పథకాన్ని  అమలు చేశారు. కానీ నేడు తెలంగాణలోని 32 జిల్లాల్లో ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్మించడం జరుగుతుందన్నారు.. అలాగే హైదరాబాద్ పట్టణంలో మరో నాలుగు పెద్ద ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్మాణంలో  ఉన్నవి . ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ ని అభివృద్ధి చేసి , ఆయా హాస్పిటల్స్ లో పని చేసే డాక్టర్స్ కి ప్రోత్సహకాలు ఇచ్చి  మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడలని ప్రభుత్వానికి సూచించారు. . హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల్లోని హాస్పిటల్స్ ని  బలోపేతం చేయాలన్నారు.ప్రైవేట్ హాస్పిటల్ కి ఆరోగ్యశ్రీ నిధులను ఇవ్వాల్సిన అవసరం అప్పుడు ఉండదన్నారు.. ఆరోగ్యశ్రీ , సీఎంఆర్ఎఫ్ నిధులను ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడానికి వినియోగిస్తే  బాగుంటుంది అని  అభిప్రాయం. వ్యక్తం చేశారు.ఫీజు రియంబర్స్ మెంట్ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ స్కూల్ లు , కాలేజిలు , ప్రభుత్వ విద్యాసంస్థలు మెరుగుపరచాల్సిన ఆవశ్యకత ఉందని సూచించారు.. ప్రభుత్వ హాస్పిటల్స్ లో , ప్రభుత్వ విద్య సంస్థలలో పని చేసే ఉద్యోగులు బాధ్యతాయుతంగా తమ కర్తవ్యాలను నిర్వర్తించాలని విజ్ఞప్తి  చేశారు..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -