Tuesday, October 21, 2025
E-PAPER
Homeఆటలుఫైనల్లో తెలంగాణ జట్లు

ఫైనల్లో తెలంగాణ జట్లు

- Advertisement -

17వ జాతీయ మినీ హ్యాండ్‌బాల్‌ పోటీలు

హైదరాబాద్‌ : 17వ హెచ్‌ఎఫ్‌ఐ జాతీయ మినీ హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. నిజాం కాలేజ్‌ గ్రౌండ్స్‌లో మూడు రోజులుగా ఉత్సాహంగా సాగుతున్న పోటీల్లో అండర్‌-12 బాలికలు, బాలుర విభాగంలో 22 జట్ల చొప్పున పోటీపడగా.. రెండు కేటగిరీల్లోనూ ఆతిథ్య జట్లు టైటిల్‌ పోరుకు చేరుకున్నాయి. బాలికల జట్టు క్వార్టర్‌ఫైనల్లో జార్ఖండ్‌పై 9-2తో, సెమీఫైనల్లో తమిళనాడుపై 17-11తో గెలుపొందింది. బాలుర జట్టు క్వార్టర్స్‌లో ఆంధ్రప్రదేశ్‌పై 25-7తో, సెమీఫైనల్లో ఉత్తరాఖాండ్‌పై 19-5తో మెరుపు విజయాలు సాధించి ఫైనల్‌కు చేరుకుంది.

బాలికల మరో సెమీస్‌లో ఢిల్లీపై హర్యానా 18-4తో నెగ్గగా.. బాలుర మరో సెమీస్‌లో జార్ఖంండ్‌పై ఢిల్లీ 20-14తో విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో హర్యానా, తెలంగాణ (బాలికలు)… ఢిల్లీ, తెలంగాణ (బాలురు) తలపడనున్నాయి. భారత హ్యాండ్‌బాల్‌ సమాఖ్య కార్యదర్శి ప్రీత్‌పాల్‌ సింగ్‌, తెలంగాణ హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మల్‌రెడ్డి రాంరెడ్డి, శ్యామల పవన్‌ కుమార్‌లు ఫైనల్‌కు చేరుకున్న జట్లను అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -