- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్) హాల్‌టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. జనవరి 3 నుంచి 20వ తేదీ మధ్య తొమ్మిది రోజులు ఈ పరీక్షలు నిర్వహించనుంది. పేపర్-1, 2లకు కలిపి మొత్తం 2.37 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సర్వీస్‌లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా టెట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈసారి కేజీబీవీల్లో పనిచేసే కాంట్రాక్టు టీచర్లతో కలిపి దాదాపు 70 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
- Advertisement -



