- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని.. రెడ్ అలర్ట్ జారీ చేసింది. భూపాలపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
- Advertisement -