Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుతెలంగాణ వేగుచుక్క దొడ్డి కొమరయ్య

తెలంగాణ వేగుచుక్క దొడ్డి కొమరయ్య

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : జమీందారుల, నిజాం నిరంకుషత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న బడుగు బలహీన వర్గాల జాతికి ఆనాడు దొడ్డి కొమరయ్య మరణం ఒక వేగుచుక్కగా మారి అందరినీ ఏకం చేసింది అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు తెలిపారు. ఏ మేరకు శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..విసునూరు దేశ్ముఖ్ జానకి యొక్క ఆగడాలను అడ్డుకోవడానికి అప్పటివరకు శాంతియుతంగా చేస్తున్న నిరసనలు దొడ్డి కొమరయ్య మరణంతో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంగా మారి జమీందారుల నిరంకుశ పాలనకు చరమాంకం పలికింది.

ఆ రోజు దొడ్డి కొమరయ్య మరణంతోనే ప్రజల్లో ఒక ఆలోచన మొదలైంది, ప్రజలందరూ ఏకతాటిపై రాగలిగారు. ప్రజలందరూ ఈ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసి విజయం సాధించగలిగారు. ఆయన మరణం పీడిత జనానికి ఒక దారి చూపెట్టింది. ఒక వేగుచుక్కగా మారింది. దొడ్డి కొమరయ్య కేవలం ఒక వ్యక్తి కాదు.. తెలంగాణ పౌరుషానికి ప్రతీక. తెలంగాణ ప్రజలు ఆనాటి నుండి ఈనాటి వరకు ఏకం కావడానికి కారణం వారి త్యాగమే. దొడ్డి కొమురయ్య వర్ధంతి సభలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు నరాల సుధాకర్, బుస ఆంజనేయులు, దర్శనం దేవేందర్, కొయ్యాడా శంకర్, బసవసాయి, బగ్గలి అజయ్, బాలన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad