కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ లో శిక్షణ తరగతులు
యువత, మహిళలను నాయకులుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా శిక్షణ
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 26న (శనివారం) ‘‘లీడర్’’ రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నామని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉపన్యాసంతో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రాష్ట్రంలోని యువత, మహిళలు, బహుజనులను రాజకీయాల్లో ప్రోత్సహించేందుకు తెలంగాణ జాగృతి ‘‘లీడర్’’ రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించబోతుందని వెల్లడించారు.. ఈ రాజకీయ శిక్షణ తరగతుల పోస్టర్ గతనెల 5వ తేదీన ఆవిష్కరించామని.. శిక్షణ తరగతులను శనివారం హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. జూలై 26న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొంపల్లిలో గల శ్రీ కన్వెన్షన్ హాల్ లో రెండు సెషన్స్ గా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ శిక్షణ తరగతుల్లో పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ప్రజాప్రతినిధుల విధులు, బాధ్యతలు, రాజ్యాంగంలో ఏయే అంశాలను పొందుపరిచారు.. ప్రజలకు సేవతో ప్రజలకు చేరువ కావాలంటే నాయకుడు వ్యవహరించాల్సిన తీరు సహా అన్ని రకాల శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లీడర్ శిక్షణ తరగతులకు హాజరవుతారని వెల్లడించారు
తెలంగాణ జాగృతి ‘‘లీడర్’’ శిక్షణ తరగతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES