Saturday, January 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగ్లోబల్‌ వర్క్‌ ఫోర్స్‌గా తెలంగాణ యువత

గ్లోబల్‌ వర్క్‌ ఫోర్స్‌గా తెలంగాణ యువత

- Advertisement -

ఆర్థిక వ్యవస్థను శాసించేది నైపుణ్యమే
‘ఫీస్టా 2026’ సదస్సులో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

అంతర్జాతీయ స్థాయి అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతను ‘గ్లోబల్‌ వర్క్‌ ఫోర్స్‌’గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఆ దిశగా యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్లింగ్‌, రీ-స్కిల్లింగ్‌, అప్‌-స్కిల్లింగ్‌ పై ప్రత్యేకదృష్టి సారించామని తెలిపారు. శుక్రవారం హైటెక్‌ సిటీలోని ఓ హోటల్‌లో ‘ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇంటెలిజెంట్‌ అండ్‌ ఎవాల్వ్డ్‌ స్ట్రాటజీస్‌ ఇన్‌ టాలెంట్‌ ఆక్విజిషన్‌(ఫీస్టా)-2026’ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థ గమనాన్ని శాసించేది మూలధనం కాదనీ, నైపుణ్యం మాత్రమేనని స్పష్టం చేశారు. భారత వృద్ధి రేటు సుమారు 7 శాతం ఉండొచ్చని తాజాగా విడుదలైన కేంద్ర ఆర్థిక సర్వే అంచనా వేసిందనీ, ఇది శుభపరిణామని చెప్పారు. ఈ వృద్ధిని నిలుపుకోవాలంటే కేవలం బడ్జెట్‌ కేటాయింపులు సరిపోవనీ, సంస్థాగత సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరముం దన్నారు. కృత్రిమ మేధపై ఆధారపడటం కంటే, దానిని సమర్థవంతంగా వాడుకునేలా సంస్థలు రూపాంతరం చెందాలని సూచించారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా వృద్ధి చేస్తూ, ఉద్యోగాల సృష్టిని ప్రోత్సహిస్తామని తెలిపారు. అత్యుత్తమ మానవ వనరుల కోసం ప్రభుత్వం రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీ, స్కిల్‌ యూనివర్సిటీ, ఐకాం, లైఫ్‌ సైన్సెస్‌ స్కూల్‌, యంగ్‌ ఇండియా ఇంటర్నేషన్‌ స్కూల్స్‌ వంటిని ఏర్పాటు చేస్తున్నదని వివరించారు. కార్యక్రమంలో సోషల్‌ టాలెంట్‌ ఫౌండర్‌ జానీ క్యాంప్‌ బెల్‌, క్యారలాన్‌ గ్లోబల్‌ సొల్యూషన్స్‌ ఎండీ పవన్‌ సచ్‌దేవా, క్రౌడ్‌ స్ట్రైక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేష్‌ మీనన్‌, ప్రముఖ నటి, రచయిత్రి మందిరాబేడీ, ఫీస్టా 2026 ఆర్గనైజింగ్‌ కమిటీ ప్రతినిధులు హరికృష్ణ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -