Friday, November 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబహ్రెయిన్‌లో తెలంగాణ యువకుడు ఆత్మహత్య

బహ్రెయిన్‌లో తెలంగాణ యువకుడు ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బహ్రెయిన్‌లో తెలంగాణ వాసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో టాకా వీధికి చెందిన అనుమల్ల శంకర్‌-లావణ్య దంపతుల కుమారుడు కల్యాణ్.. పనికోసం పది నెలల క్రితం బహ్రెయిన్‌కు వెళ్లాడు. అక్కడ ఓ కార్ల వర్క్‌షాప్‌లో పనిలో చేరాడు. మంగళవారం కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా గదిలో బర్త్‌ డే పార్టీ చేశారు. కానీ అదే రోజు రాత్రి అర్ధరాత్రి కల్యాణ్ ఉరేసుకున్నాడు. దీంతో తోటి కార్మికులు షాకయ్యారు. కొడుకు మృతి వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -