- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా జైలులో తెలుగు యువకుడి ఆత్మహత్య చేసుకున్నాడు. జనగామ(D) నెల్లుట్లకు చెందిన కుర్రెముల సాయికుమార్(31) పదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. ఉద్యోగం చేస్తూ భార్యతో కలిసి నివాసముంటున్నాడు. 2023లో ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో అరెస్ట్ అయ్యాడు. 2025 మార్చి 27న అమెరికా కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించింది. దీంతో మానసిక వేదనకు గురైన సాయికుమార్ జులై 26న జైలులోనే ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
- Advertisement -