Thursday, November 13, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుసివిల్స్‌ మెయిన్స్‌లో తెలంగాణ సత్తా

సివిల్స్‌ మెయిన్స్‌లో తెలంగాణ సత్తా

- Advertisement -

రాష్ట్రం నుంచి 43 మంది ఇంటర్వ్యూకు ఎంపిక
అభినందనలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీీఎస్సీ) 2025 మెయిన్స్‌ పరీక్ష ఫలితాల్లో తెలంగాణ సత్తా చాటింది. రాష్ట్రం నుంచి 43మంది ఎంపికయ్యారు. ఈ మేరకు యూపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ బుధవారం వెల్లడించింది. ఆగస్టు 22 నుంచి 31 వరకు నిర్వహించిన మెయిన్స్‌ పరీక్షలో మొత్తం 2,736 మంది ఉత్తీర్ణత పొందారని పేర్కొంది. అర్హత సాధించిన అభ్యర్థులను ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌, ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌, ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌, ఇతర కేంద్ర సర్వీసులకు (గ్రూప్‌ ఏ, గ్రూప్‌ బీ) ఎంపిక కోసం పర్సనాలిటీ టెస్ట్‌ (ఇంటర్వ్యూ)కి పిలుస్తారు. అందుకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటించనుం ది. ఫలితాలను యూపీీఎస్సీ తన అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. అయితే తెలంగా ణ నుంచి ఇంటర్వ్యూకి సెలక్ట్‌ అయిన వారంతా రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయ హస్తం పథకం కింద సాయం పొందినవారే కావడం గమనార్హం.

మెయిన్స్‌ విజేతలకు సీఎం అభినందనలు
రాష్ట్రం నుంచి సివిల్స్‌ ఇంటర్వూకు 43 మంది ఎంపిక కావడం పట్ల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. తుది దశ ఇంటర్వూలో సత్తా చాటి తెలంగాణ ఖ్యాతిని దేశ వ్యాప్తం చేయాలని ఆకాక్షించారు. రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయ హస్తం పథకం కింద సింగరేణి సహకారంతో సివిల్స్‌ ప్రిలిమ్స్‌, మేయిన్స్‌, ఇంటర్వూ వరకు మూడు దశల్లో రూ.లక్ష చొప్పున అందిస్తున్నామని చెప్పారు. అర్హత సాధించిన 43 మందికి మరో రూ.లక్ష త్వరలో అందిస్తామని ప్రకటించారు. గతేడాది ఈ పథకాన్ని ప్రారంభించగా ఇప్పటివరకు 342 మంది తెలంగాణ యువతకు 3.62 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని సింగరేణి సంస్థ ద్వారా పొందారని వారు తెలిపారు. తెలంగాణ నుంచి సివిల్స్‌ ఇంటర్వూకు ఎంపికైన 43 మంది అభ్యర్థులకు సింగరేణి సీఎండీ ఎన్‌. బలరామ్‌ అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -