Monday, February 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బడ్జెట్ లో తెలంగాణకు మొండిచేయి..

బడ్జెట్ లో తెలంగాణకు మొండిచేయి..

- Advertisement -

యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్టానికి మొండిచేయి చూపిందని యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్య,వైద్యానికి బడ్జెట్ కేటాయింపులో 3% కూడా దాటలేదన్నారు. వరంగల్ ఎయిర్పోర్ట్ ఊసే లేదని, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ప్రస్తావన లేదని, ములుగులో గిరిజన యూనివర్సిటీ పేరే లేదని, ఘనపూర్ కోట గుళ్ళు, రామప్ప దేవాలయ అంశాలు లేవని, కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్ట్స్ సంబందించిన ప్రస్తావన లేదన్నారు. మేడారం జాతర గురించి చర్చ లేదని, ఐఐటీ, ఐఐమ్, ఎయిమ్స్ ఇతర సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఊసే లేదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -