Sunday, August 3, 2025
E-PAPER
Homeసినిమాతెలుగు సినిమా సత్తా చాటింది

తెలుగు సినిమా సత్తా చాటింది

- Advertisement -

కేంద్రం ప్రకటించిన జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటిందని ప్రజా నాట్య మండలి సినిమా శాఖ పేర్కొంది. అధ్యక్షుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌, కార్యదర్శి మద్దినేని రమేష్‌, కోశాధికారి డాక్టర్‌ మాదాల రవి ఈమేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు.
‘భగవంత్‌ కేసరి’తో పాటు ‘హనుమాన్‌’, ‘బలగం’ చిత్రాలకు అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రాంతీయ ఉత్తమ చిత్రం భగవంత్‌ కేసరి సినిమాకు అవార్డు రావడంతో పాటు వ్యక్తిగత కేటగిరిలో కూడా ఉత్తమ గేయ రచయిత, ఉత్తమ గాయకుడు వంటి అవార్డులు గెలుచుకోవడం తెలుగు సినిమాకు గర్వకారణం అని పేర్కొన్నారు. ‘గాంధీతాత చెట్టు’ సినిమాలో తొలిసారిగా నటించిన సుకుమార్‌ కుమార్తె సుక్రుతి ఉత్తమ బాల నటిగా ఎంపిక కావడం అభినందనీయమన్నారు. ఇన్ని అవార్డులు ఒకేసారి తెలుగు సినిమాకు రావడం ఇదే తొలిసారి అని, తెలుగు సినిమా కథల ఎంపికలోను, మేకింగ్‌లోనూ పాన్‌ ఇండియా స్తాయిలో సత్తా చాటుతోందని హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -